ఎస్సీ కాలనీలో మురుగు నీరు వెళ్లే మార్గం లేక ఇళ్లముందే నిల్వ వుంటూ ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వానులు డీపీవో అనుపమకు విన్నవించారు. మండలంలోని దోనకాయలపాడు ఎస్సీకాలనీని, రామభద్రాపురంలో చెత్తనుండి సంపద కేంద్రాన్ని, డీపీవో శుక్రవారం పరిశీలించారు. దోసకాయలపాడు ఎస్సీ కాలనీలో మురుగు నీటి కాలువల్లో మురుగు ఎక్కడిక్కడే నిల్వ వుండి దుర్గంధం వెదజల్లుతుండటంపై అనంతృప్తి చెందారు.మురుగుకాలువలు ఒక్క క్రమ పద్దతిలో కట్టక పోవటం వల్ల నీరు దిగువకు ప్రవహించక కాలువల్లోనే నిలువ వుంటుందని కాలనీ వాసులు తెలిపారు. అనేక సంవత్సరాల నుండి ఈనమస్య ఉన్నదని, అధికారులు శాశ్వత పరిష్కారం చూపటం లేదని, కాలువను వాలుగా ఉన్న వైపు మళ్లించి మురుగు నీరు నిల్వ వుండకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సంబంధిత అధికారులతో సంప్రదించి తగు చర్యలు చేపడతామని డీపీవో చెప్పారు. డీపీవో మాట్లాడుతూ కాలనీ వానులు కూడా శుభ్రత పాటించాలన్నారు. ప్రతి ఇంటి ముందు కాలువలో ప్లాస్టిక్ బాటిళ్లు వేస్తున్నారని, దీనివల్ల కాలువులు పూడిపోతున్నాయన్నారు. అందువల్లే కాలనీలో పారిశుద్యం ఆద్వాన్నంగా వుంటుందన్నారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ బాటిళ్లను భద్రపరిచి గ్రామాలకు వచ్చే స్వచ్చ రథాల వద్ద ఇచ్చి డబ్బుకాని, వస్తువులు కానీ తీసుకోవాల న్నారు. స్థానిక స్వర్ణ కార్యాలయ సిబ్బంది, వివోఏలు ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. రామభద్రాపురంలో చెత్త సంపదతయారి కేంద్రం వినియోగంలో వుండి వానపాముల నుండి ఎరువులను తయారు చేస్తుండటం పట్ల డీపీవో సంతృప్తి వ్యక్తం చేశారు. చెత్త సంపద తయాకీ కేంద్రాల్లో తయారైన ఎరువులను రైతులకు అమ్మి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని నమకూర్చాలన్నారు. గ్రామంలో పారిశు ద్యాన్ని పరిశీలించారు. ప్రజలకుశుభ్రమైన, స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందేలా చూడాలన్నారు డిప్యూటీఎంపీడీవో వి.శ్రీనివాసరావు, పంచాయతీ అభివృద్ధి అధికారులు కెవి. సుబ్బారావు, కోటేశ్వరి, స్వర్ణగ్రామ కార్యాలయాల సిబ్బంది, షేక్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

