రామ్ గోపాల్ పేట సెప్టెంబర్ 11,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్ పేట బిఆర్ఎస్ పార్టీ నుండి పలువురు యువ నాయకులు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు సమక్షంలో రాంగోపాల్ పేట్ కు చెందిన బిఆర్ఎస్ యువ నేత పిల్లి సుశీల్ కుమార్ వారి అనుచరులతో కలిసి బీజేపీ పార్టీలో చేరారు. వారికి రామచంద్రరావు కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు,కార్యకర్త కృషి చేయాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు.దేశం కోసం..ధర్మం కోసం బీజేపీ పార్టీ, ప్రధాని మోడీ చేస్తున్న కృషిని చూసి తాను..తన బృందం బీజేపీలో చేరుతున్నట్లు సుశీల్ చెప్పారు.పార్టీ బలోపేతానికి తామంతా కృషి చేస్తామని చెప్పారు.అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశారు.ఈ చేరికలో పి. నాగరాజ్,సి. విజయ్ కుమార్,సాయి కిరణ్, అనిల్,రాకేష్, సాయి రామ్, విష్ణు కుమార్ లు ఉన్నారు.

