హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత…..ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్.ఒక లీటర్ హ్యాష్ ఆయిల్…..21.2కేజిల 18గంజాయి ప్యాకెట్లు ,2సెల్ ఫోన్లు స్వాధీనం.

హైదరాబాద్ సెప్టెంబర్ 12,(జే ఎస్ డి ఎం న్యూస్)
నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కమీషనర్ టాస్క్‌ఫోర్స్ ,సికింద్రాబాద్ జోన్ బృందం,కాచిగూడ పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒడిశా, ఏపీ సరిహద్దుల నుంచి నగరానికి హ్యాష్ ఆయిల్, గంజాయిని తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి దాదాపు రూ. 23 లక్షల విలువైన లీటర్ హ్యాష్ ఆయిల్, 21.2 కిలోల గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా గతుం గ్రామానికి చెందిన పాంగి సతీష్ కుమార్ (29), ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా అబోరాడకు చెందిన పాంగి గణేష్ (29) వరుసకు బావబావమరుదులు. కూలీ పనులు చేసుకునే వీరిద్దరూ సులభంగా డబ్బు
సంపాదించాలనే దురాశతో డ్రగ్స్ దందా వైపు మళ్లారు. హైదరాబాద్ నగరంలో వీటికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగా ఒడిశాకు చెందిన లోక్‌నాథ్ అనే ప్రధాన డీలర్ వద్ద నుంచి హ్యాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి నగరంలోని వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో కాచిగూడ రైల్వే స్టేషన్ పార్శిల్ ఆఫీస్ సమీపంలోఅనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులపై సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (సికింద్రాబాద్ జోన్), కాచిగూడ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, రెండు గోనె సంచులలో దాచిన 18 ప్యాకెట్ల గంజాయి (21.2 కేజీలు), ఒక లీటర్ హ్యాష్ ఆయిల్ బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు లోక్‌నాథ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఈ ఆపరేషన్‌ను టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షణలో సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జె. రాజశేఖర్, కాచిగూడ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజశేఖర్, ఎస్సైలు బి. మహేష్, ఎ. భరత్ కుమార్ మరియు సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. నగరంలో మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *