బేగంపేట సెప్టెంబర్ 12,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ ఎస్ పి రోడ్డు
శ్రీ వీరాంజనేయ దేవాలయంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేశారు.పబ్బా సంతోష్ కుమార్,సరిత దంపతుల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పబ్బా దంపతులు పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు కేవలం మట్టి గణపతులు ఏర్పాటు చేసుకుని పూజించాలని కోరారు.భవిష్యత్ తరాలకు చక్కటి ,ఆహ్లాద కరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మట్టి గణ పతుల ను పూజించాలన్నారు.తన సతీమణి సరిత సూచన మేరకు హనుమాన్ ఆలయంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశామని ప్రతి ఏటా ఇలాగే పంపిణీ చేయనున్నామని సంతోష్ కుమార్ తెలియ జేశారు.
