హైదరాబాద్ సెప్టెంబర్ 12,(జే ఎస్ డి ఎం న్యూస్)
వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని సినీ నటులు తనికెళ్ళ భరణి
పిలుపునిచ్చారు. శనివారం రాత్రి శ్రీకృష్ణ నగర్ లో శ్రీ వాసవి యువజన సేవా సంఘం ప్రతినిధులు తనికెళ్ల భరణికి మట్టి గణపతిని అందజేశారు. ప్రతియేటా మట్టి గణపతిని పూజిస్తే అని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా మట్టి గణపతుల కోసం ప్రచారం నిర్వహిస్తూ మట్టి గణపతిని ప్రతిష్టించిసంప్రదాయబద్ధంగా నిర్వహించే వేడుకలు అభినందనీయం అన్నారు. కార్యక్రమం లో సంస్థ ప్రతినిధి, సామాజిక కార్యకర్త పుట్టా రామకృష్ణ, సూర్యరావు, కొండారావు, మహేష్, కుమార్, సాయి, శ్రవణ్, శ్రీకాంత్, లక్ష్మీరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు .
