ఆపరేషన్ పోలో అమరవీరులకు బీ జీ పి ఘన నివాళులు.

బేగంపేట సెప్టెంబర్ 13,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించిన చారిత్రక ‘ఆపరేషన్ పోలో’ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. 1948 సెప్టెంబర్ 13న ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేపట్టిన పోలీస్ చర్య ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సంగతి తెలిసిందే.
ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మారక కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ సమగ్రత, తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం
ప్రాణాలర్పించిన పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *