మంచి మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతుంది……ఎమ్మెల్యే తలసాని.

సనత్ నగర్ సెప్టెంబర్ 13,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఎన్ని ఆస్తులు, అంతస్తులు సంపాదించినా మనం చేసిన మంచి మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ లోని బి కె గూడ లో గల సీనియర్ సిటీజన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆగస్టు 15 ఇండి పెండెన్స్ డే సందర్భంగా సీనియర్ సిటీజన్స్ కు నిర్వహించిన క్యారమ్, చెస్, జనరల్ నాలెడ్జ్ పోటీలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అవార్డులు పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వయసును సైతం లెక్క చేయకుండా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సనత్ నగర్ సీనియర్ సిటీజన్స్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. క్రీడలలో సైతం సీనియర్ సిటీజన్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. సీనియర్ సిటీజన్స్ లో మరింత ఉత్సాహం పెంపొందించే విధంగా పెద్ద ఎత్తున సీనియర్ సిటీజన్స్ క్రీడా పోటీల నిర్వహించాలని, అందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. అదేవిధంగా కౌన్సిల్ కార్యాలయంలో సీనియర్ సిటీజన్స్ కు ఉపయోగపడే విధంగా వివిధ పుస్తకాల తో లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపే వయసులో కూడా సమాజానికి ఏదో చేయాలనే తపనతో పేదలకు అన్నదాన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీతో గడపటం నాకు ఎంతో సంతృప్తి, సంతోషంగా ఉంటుందని ఆయన చెప్పారు. మీరు నిర్వహించే కార్యక్రమాలకు ఎల్లవేళలా తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. 2014 లో ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి మాకు అన్ని విధాలుగా అండగా ఉంటూ తమను ఎంతో ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురు సీనియర్ సిటిజన్ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, సీనియర్ సిటీజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు దూబే, మాజీ అధ్యక్షులు పార్థసారథి, మానిక్ రావ్ పాటిల్, జెఎస్టీ సాయి, ఆనంతరెడ్డి, సహదేవ్ గౌడ్, మల్లారెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, రాజేష్, గులాబ్ సింగ్, భోగి బాలరాజ్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *