తాళ్లూరు: పాఠశాల యాజమాన్య కమిటీ ( ఎస్ ఎం సీ) ఎన్నికలు ఈనెల 29న నిర్వహించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య తెలిపారు.అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను మంగళవారం విడుదల చేసారు. ఈనెల 18న మధ్యాహ్నం రెండు గంటలకు పాఠశాల నోటీన్ బోర్డు పై ఓటర్ల జాబితా ప్రదర్శన చెస్తారని చెప్పారు. 25న ఓటర్ల జాబితా పై మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం ఉంటుందని చెప్పారు. ఈనెల 29న ఎస్ ఎంసీ ఎన్నిక నిర్వహణ, ఖరారు ఉదయం ఏడుగంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని, అనంతరం 1.30 గంటలకు చైర్ పర్సన్, వైన్ చైర్మన్ ల ఎన్నిక, రెండు గంటలకు ప్రమాణ స్వీకారం, 3.00 గంటల నుండి 3.30 గంటల వరకు ఎన్ ఎంసీ మొదటి సమావేశం నిర్వహించబడునని వివరించారు. పాఠశాలల పర్యవేక్షణ , మెరుగైన యాజమాన్యం కోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు కూడ ఎస్ ఎం సి లను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు షేడ్యూల్ విడుదల
15
Sep