సికింద్రాబాద్ సెప్టెంబర్ 15 (జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ అలూమ్ని అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ జి.ఆర్. లింగమూర్తి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ బాడీ సమావేశంలో సభ్యులు ఆయనను వచ్చే రెండేళ్లకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గత నాలుగేళ్లుగా అసోసియేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టానని, మూడోసారి తనను ఎన్నుకున్న సభ్యులకు లింగమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.
