బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంమహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

బేగంపేట సెప్టెంబర్ 16,(జే ఎస్ డి ఎం న్యూస్)
బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సుల్లో బోధనకు గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులుఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఇంగ్లీష్, కామర్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, బోటనీ, కెమిస్ట్రీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ విభాగంలో కనీసం 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం) సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నెట్, సెట్ లేదా పీహెచ్‌డీ అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కళాశాల పీజీ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, అభ్యర్థులు నిర్దేశిత సమయానికి హాజరు కావాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *