బేగంపేట సెప్టెంబర్ 16,(జే ఎస్ డి న్యూస్)
రాంగోపాల్ పేట డివిజన్ కు చెందిన. కాంగ్రెస్ నాయకులు త్రికాల మనోజ్ ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. మనోజ్ తండ్రి పాండరి ఇటీవల మరణించగా, బుధవారం బేగంపేట ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు దశదిన కర్మను నిర్వహించారు. ఈ దశదిన కార్యక్రమానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై పాండరి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మనోజ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో బేగంపేట డివిజన్ కు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టి. శ్రీహరి, శేఖర్, ఆరీఫ్, అడ్డు తదితరులు ఉన్నారు.
