బేగంపేట సెప్టెంబర్ 16,(జే ఎస్ డి ఎం న్యూస్)
హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో వినాయక చవితి ఒకటి అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ నవరాత్రులలో భాగంగా మంగళవారం రాత్రి రాంగోపాల్ పేట డివిజన్ లోని ఓల్డ్ బోయిగూడలో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణ నాధుడిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పని చేపట్టిన ఎలాంటి ఆటంకాలు కలగవద్దని వినాయకుడికి మొదటి పూజ నిర్వహించడం హిందూ సాంప్రదాయం అని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు భజనలు, పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుందని చెప్పారు. శాంతియుత వాతావరణం లో పండుగను జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు అరుణ్ భట్, మనోజ్, సూరి, అస్లాం, రవి, ప్రకాష్, శ్రవణ్, సునీల్, అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.
మోండా డివిజన్…
గణేష్ నవరాత్రుల సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రాత్రి మోండా డివిజన్ లో గణేష్ మండపాలను సందర్శించి పూజలు నిర్వహించారు. ముందుగా గ్యాస్ మండి ఆదయ్య నగర్ లో ప్రతిష్టించిన గణ నాధుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, రాములు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
ఠకారా బస్తీలో…
ఠకారా బస్తీలో అశోక్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణ నాధుడిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రాత్రి దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రవి, చంద్రకాంత్, ప్రేమ్ సాగర్, మల్లిఖార్జున్, బి ఆర్ ఎస్ నాయకులు కొండాపురం మహేష్ యాదవ్, తదితరులు ఉన్నారు.

