ఒంగోలు: అడ్వెంట్జ్ ఆధ్వర్యంలో ఒంగోలులో రిటైలర్స్ మీట్ నిర్వహించారు. విజయవాడ రీజినల్ మార్కెటింగ్ ఆఫీస్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో డీలర్లు, రిటైలర్లు పాల్గొన్నారు. మార్కెట్ పరిస్థితులు, రాబోయే సీజన్ వ్యాపార ప్రణాళికలు, ఉత్పత్తుల లభ్యత తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా అడ్వెంట్జ్ రీజినల్ హెడ్ ఎస్.ఎం.డి. రఫీ మాట్లాడుతూ …….ఒంగోలు మార్కెట్‌లో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్టాక్ పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ డీలర్లతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. టీఎస్‌పీ ఎరువుల ప్రాధాన్యతను కూడా వివరించారు.
మార్కెట్ డెవలప్‌మెంట్ విభాగం పి.వి. సుభాష్ ఎస్పీఎన్ ఉత్పత్తులపై సాంకేతిక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉత్పత్తుల కూర్పు, మోతాదు, వినియోగ విధానం, ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా మిరప, పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు సంబంధించిన వినియోగ విధానాలను వివరించారు. సమతుల్య ఎరువుల వినియోగం, నేల ఆరోగ్యం ప్రాధాన్యతను తెలియజేశారు.
అనంతరం నానో డీఏపీ, బయో-20, స్మార్ట్ సొల్యూషన్, న్యూ సిలికా ఉత్పత్తులపై డీలర్ల సందేహాలను నివృత్తి చేశారు.
కార్యక్రమాన్ని ఎం.ఓ. ఎం. హరికిషన్ స్వాగత ప్రసంగంతో ప్రారంభించగా, ప్రముఖులు, డీలర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమం ముగింపులో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎం.డి. రఫీ, పి.వి. సుభాష్, ఎం. హరికిషన్, ఎస్. రణదీప్, గోపీ కృష్ణ, హరికృష్ణ, రామకృష్ణ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.




