ఎల్ ని నో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సోమవారం నిర్వహించిన పునర్నిర్మాణ పనులు చేపట్టిన కారుమంచి మేజర్ కాలువ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు .బి.ఎన్.విజయ్ కుమార్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధనరావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూగత ప్రభుత్వ కాలంలో కాలవ కట్టలు తెగిపోయి మోదుకాన్ క్వారీ లో కి నీరు వెళ్లడంతో మొదలైనటువంటి రైతుల కష్టాలు నేడు రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పిపి-4 ఆధ్వర్యంలో నెల్లూరు వెంకట శేషయ్య ఎన్నారై ముందుకు వచ్చి 25 లక్షల రూపాయలతో ప్రారంభించిన టువంటి పనులు బియ్యం విజయ్ కుమార్ సర్వతో డిఎంఎఫ్ నిధులు 2.62 కోట్ల రూపాయలు వెచ్చించి 500 మీటర్ల పొడవున్నటువంటి కారుమంచి కాలువను సిమెంట్ కట్టలతో పకడ్బందీగా పునర్ నిర్మించడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ దిగు ప్రాంతాల్లో 16 వేలకు పైగా ఎకరాలకు సాగునీరు 16 గ్రామాలకు సాగునీరు అందించడంలో ఈ మేజర్ కాలువ కీలకపాత్ర పోషించిందని రైతులు స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి మేరకు డిఎంఎఫ్ నిధులతో పాటు బిఫోర్ కార్యక్రమం కింద స్థానిక ప్రముఖులు నల్లూరి వెంకట శేషయ్య అందించిన 25 లక్షలతో కాంక్రీట్ గట్టు నిర్మించామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనే నీటి వనరుల నిర్వహణ కోసం రూ 1308 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. రైతు ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. రాయలసీమకు హంద్రీనీవా జలాలు తీసుకురావడంతో పాటు గోల్కొండ ప్రాజెక్టుకి నీళ్లు ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలను తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు మరియు కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని పునర్ఘాటించారు. కలెక్టర్ రాజా బాబు మాట్లాడుతూ ….. ఐదు నెలల లోపే ఈ పనులను పూర్తి చేసినందుకు దిగు ప్రాంతాల ప్రజలకు త్రాగు సాగునీరు అవసరాలు తీరబోతున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో ఇతర పనులకు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జలధార జల హారతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 3 వేలకు పైగా పనులు పూర్తి చేస్తున్నామని వర్షాలు వచ్చిన తర్వాత వాటి ఫలితాలు అందుతాయని అన్నారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ…… వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన సాగునీటి సౌలభ్యం కల్పించడం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ఈ దిశగా తీసుకుంటున్న చర్యలే దీనికి నిదర్శనమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటర్ మ్యాన్ గా, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు డిప్యూటీ వాటర్ మెన్ గా పేరు గడించారని అన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ…… త్రాగు సాగునీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎంతో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించారని ప్రస్తుతం గ్రానైట్ ప్రాంతమైన చీమకుర్తి అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా అభివృద్ధి పరిచిన కారుమంచి కాలువను జలవనరుల శాఖామంత్రి ప్రారంభించడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఈనెల 30వ తేదీన ఒంగోలులో నిర్వహించే మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకల్లో పాల్గొనాలని ప్రజలకు ఈ సందర్భంగా జనార్దన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు నల్లూరి వెంకట శేషయ్య, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ముప్పువరపు సుచిత్ర వీరయ్య చౌదరి ,ఎన్నారై తక్కిలపాటి రమేష్, ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్, గొట్టిపాటి రాఘవరావు, కాట్రగడ్డ రమణయ్య, కందిమళ్శ గంగాధర్ రావు,గొల్లపూడి సుబ్బారావు అవనిగడ్డ శేషయ్య కోటమి నాయకులు కార్యకర్తలు, రైతులు మహిళలు భారీగా పాల్గొన్నారు .




