శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం.

బేగంపేట అక్టోబర్ 13 (జేయస్ డిఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం చండీ హోమం పూజ నిర్వహించారు. హోమం పూజలో ఆలయ ఈవో వంగ అంబుజా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ షిరిడి కామేశ్వర్ లు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ గావించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో ఆలయంలో పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *