హైదరాబాద్‌ మార్కెట్లోకి ‘ఏక’ ఎలక్ట్రిక్‌ ఆటో.. రెండు గంటల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌!

సికింద్రాబాద్, అక్టోబర్ 13 (జె ఎస్ డి ఎం న్యూస్ ) : ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ‘ఏక మొబిలిటీ’ రూపొందించిన అత్యాధునిక ‘ఈవిఐ3ఎస్’ (evi3s) ఎలక్ట్రిక్‌ ఆటోరిక్షా తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశించింది. సంస్థ అధికారిక డీలర్‌ స్కేడ్‌ రైడ్స్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లోని అలా లిబర్టీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సంస్థ ప్రతినిధులతో కలిసి ఈ వాహనాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. దీని ప్రారంభ ధరను రూ.3.85 లక్షలుగా నిర్ణయించారు.
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోలో ఏసీ, డీసీ ఛార్జింగ్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. సాధారణ 16-యాంపియర్‌ గృహ విద్యుత్‌ సాకెట్‌తో పాటు డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉండటంతో, సాధారణంగా పట్టే నాలుగు గంటల సమయం కేవలం రెండు గంటలకు తగ్గనుంది. తెలంగాణ వ్యాప్తంగా తొలి ఏడాదిలోనే 2,500 ఎలక్ట్రిక్‌ ఆటోరిక్షాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. హైదరాబాద్‌లో పర్యావరణహిత త్రిచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా, త్వరలోనే దక్షిణాదిలోని ఇతర ప్రధాన నగరాలకు సైతం తమ సేవలను విస్తరిస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్కేడ్‌ రైడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పృథ్వీ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మనోజ్‌ కోఠారి, రాజేందర్‌ కోఠారి, రీజినల్‌ మేనేజర్లు కామేష్‌ అరుముగం, హరి ప్రసాద్‌, తెలంగాణ ఆటోమొబైల్స్‌ ఫైనాన్షియర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉగంరాజ్‌ నహర్‌ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *