తాళ్లూరు : మండల స్థాయిలో స్టూడెంట్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంపిటేషన్ శుక్రవారం నిర్వహించారు. ప్రాధమిక హక్కులు – విధులు అనే అంశంపై వ్యాస రచన పోటీ, సమాజ సంక్షేమం కోసం చట్టాలు చేయటంలో శాసన సభ పాత్ర అనే అంశంపై ఉపన్యాస పోటీ, భారత స్వాతంత్ర్య పోరాటం, జాతీయ ఉద్యోగం మరియు ఆధునిక భారత దేశ నిర్మాణం అనే అంశంపై క్వీజ్ పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో వ్యాస రచన, ఉపన్యాస పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన ఆరు మంది నుండి క్విజ్ పోటీ ద్వారా ముగ్గురిని ఎంపిక చేసారు. అందులో షేక్ ఆరిష్య ప్రధమ స్థానంలో, జి దివ్య రెండవ స్థానంలో, ఎం ఫారుక్ తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలకు మండల విద్యాశాఖాధికారి గురిజాల నుబ్బయ్య, ఎంఈఓ -2 నుధాకర్ రావులు అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: