గంజాయి విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర నేరస్థుడి అరెస్ట్ – 1.94 కేజీల పొడి గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం

హైదరాబాద్ అక్టోబర్ 31(జే ఎస్ డీ ఎం న్యూస్ ) : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (చార్మినార్ జోన్) బృందం మరియు బండ్లగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ విక్రయాలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని బండ్లగూడ ఎక్స్ రోడ్స్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి సుమారు రూ. 1,00,000/- విలువగల 1.94 కేజీల పొడి గంజాయి మరియు ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుడిని బండ్లగూడ, న్యూ ఇందిరానగర్ నివాసి, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ ఆసిఫ్ (38) (తండ్రి: దివంగత షేక్ అబ్బాస్) గా గుర్తించారు. కేసు వివరాల్లోకి వెళితే…… ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న షేక్ ఆసిఫ్ చెడు వ్యసనాలు మరియు గంజాయికి బానిసయ్యాడు. ఆటో ద్వారా వచ్చే ఆదాయం తన జాతర ఖర్చులకు సరిపోకపోవడంతో, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి నగరంలోని గౌస్ నగర్ మరియు క్రిస్టల్ టౌన్ కాలనీ ప్రాంతాల్లో అవసరమున్న వారికి అధిక ధరలకు విక్రయించాలని పథకం రూపొందించాడు. ఇందులో భాగంగా ఈ నెల 28 న నాగ్‌పూర్ వెళ్ళి, అక్కడ ఒక అపరిచిత వ్యక్తి వద్ద కేజీ రూ. 5,000/- చొప్పున 2 కేజీల పొడి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని తన నివాసానికి తెచ్చి దాచాడు. అనంతరం శనివారం సదరు గంజాయిని విక్రయించేందుకు బండ్లగూడ ఎక్స్ రోడ్స్ వద్ద నిరీక్షిస్తుండగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

హైదరాబాద్ నగర అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (టాస్క్ ఫోర్స్, చార్మినార్ & గోల్కొండ జోన్స్) శ్రీ కె.ఎస్. రావు పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ సి. యాదేందర్, బండ్లగూడ పిఎస్ ఎస్‌హెచ్‌ఓ ఆర్. దేవేందర్, టాస్క్ ఫోర్స్ ఎస్సైలు కె. రామారావు, ఎం. మహేష్, కె. శివకుమార్, బండ్లగూడ పిఎస్ ఎస్సై ఎన్. నాగరాణి, టాస్క్ ఫోర్స్ పిసి టి. ప్రశాంత్ మరియు ఇతర సిబ్బంది పాల్గొని నిందితుడిని విజయవంతంగా బంధించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *