12 మంది పోలీసు అధికారుల పదవీ విరమణ -ఘనంగా వీడ్కోలు పలికి సత్కరించిన సీపీ వీసీ సజ్జనర్

హైదరాబాద్ అక్టోబర్ 31(జే ఎస్ డీ ఎం న్యూస్ ) : శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన 12 మంది పోలీసు అధికారులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్వీ సీ సజ్జనర్ ఘనంగా సత్కరించారు.హైదరాబాద్ టీజీఐసీసీసీ (TGICCC) లో శనివారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎస్సైలు బి.చంద్రయ్య, ఆర్. సత్యానందం, వి.అంజయ్య, ఏఎస్సైలు మహమ్మద్ అబ్దుల్ హమీద్, నర్సింగ్ రావు, రామ్ చందర్, సురేష్, మనోజ్ కుమార్, వెంకట్ రావు, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుళ్లు అభిమాన్ సింగ్, నర్సింహాలు ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులను, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారిని సీపీ గారు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. “సాంకేతికత లేని ఆ రోజుల్లో సైకిళ్లు, కాలినడకన గస్తీ తిరుగుతూ మత కల్లోలాలు, ఉగ్రవాదం, నక్సలిజం వంటి తీవ్ర సమస్యలను సిబ్బంది ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నారు. మీ నిస్వార్థ సేవలు, కఠిన శ్రమ ఫలితంగానే నేడు హైదరాబాద్ నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నాయి.. ప్రస్తుత పోలీసు తరానికి మీరే అసలైన స్ఫూర్తిదాతలు. మొదటి ఇన్నింగ్స్‌లో ఎంతో క్రమశిక్షణతో పనిచేసిన మీరు, రెండో ఇన్నింగ్స్‌లో కుటుంబంతో ఆనందంగా గడుపుతూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రోజూ వాకింగ్, యోగా వంటివి సాధన చేస్తూ శారీరక, మానసిక ఉల్లాసాన్ని కాపాడుకుంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి. ఉద్యోగ విరమణ సమయంలో వచ్చే ఆర్థిక ప్రయోజనాలను తప్పుడు పెట్టుబడులు, సైబర్ నేరగాళ్ల బారినపడి పోగొట్టుకోకుండా పోస్టాఫీసు, సురక్షిత బ్యాంకు డిపాజిట్లలో మాత్రమే మదుపు చేయాలి. రిటైర్డ్ సిబ్బంది సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.. ఎలాంటి సమస్య వచ్చినా నిస్సంకోచంగా సంప్రదించవచ్చు” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ (అడ్మిన్) కె.వెంకటలక్ష్మి, సీఏడీవో జేబీజే ఆనంద్ కుమార్, సీఏవో చంద్రకళ, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సొసైటీ కార్యదర్శి నల్ల శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎండీ ఆసిఫ్ ఖాన్, కోశాధికారి జి.ఎం.ఎస్.విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *