విశాఖపట్నం,నవంబర్,15 (జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
విశాఖ నగరంలో ది మహారాజా కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ స్టాఫ్ కి బోర్డు అఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలో సైబర్ శిక్షణా కార్యక్రమం ఆదివారం క్షత్రియ సంక్షేమ సమితిలో జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఎం. రామకృష్ణం రాజు బ్యాంక్ సిబ్బందికి తగిన సూచనలు మరియు సలహాలు అందించారు.
ముఖ్య అథితిగా కో- ఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారి సి.హెచ్ త్రినాథ రావు కస్టమర్స్ తో ఎలా ఉండాలి, వారికి ఎలాంటి సేవలు అందించాలి అనే ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమలో సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆదిత్య వర్మ మరియు సైబర్ ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన ఎం.సుధీర్ వర్మ శిక్షణ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ జనరల్ మేనేజర్స్ ఎన్. ఎన్. సత్యనారాయణ, ఎం. మురళీ కృష్ణ వర్మ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 బ్రాంచ్ మనేజర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: