తాళ్లూరు మండలం లోని శివరాంపురం గ్రామంలో వైసీపీకి చెందిన 45 కుటుంబాలు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటిలక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ ల సమక్షంలో గురు వారం ఆపార్టీలో చేరారు. దర్శి టీడీపీ కార్యాలయంలో ఆగ్రామ మాజీ ఎంపీటీసీ గాడిపర్తి లక్ష్మినారాయణ, వద్దినేని నాగయ్య, నారిపెద్ది కల్యాణ్ చక్రవర్తి సారథ్యంలో వైసీపీకి చెందిన అనపర్తి సిద్ధయ్య, కోండ్రు భాస్కర్రావు ఆధ్వర్యంలో 45 కు టుంబాలు టీడీపీ లో చేరారు. వారికి టీ డీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
టీడీపీలో చేరిన శ్రేణు లకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పారు. గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 45 వైసీపీ కుటుంబాలు కూటమి పాలనలో జరుగుతున్న ప్రగతిని చూసి టీడీపీలో చేరారని తెలిపారు. ఇంకా మరిన్ని చేరికలు ఉంటా యన్నారు. కార్యక్రమంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి అనపర్తి షడ్రక్, రాజు తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: