భక్త కనకదాసు జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భక్త కనకదాసు గారు 1509 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించి, విశిష్టమైన కవిగా, తత్వవేత్తగా, సామాజిక సంస్కర్తగా గుర్తింపు పొందారని, తన రచనలు, కీర్తనల ద్వారా సమాజంలోని కుల అసమానతలను రూపుమాపేందుకు కనకదాసు గారు చేసిన కృషి ఎనలేనిదన్నారు . ఆయన రచనలు ప్రజల్లో భక్తి, మానవత, సమానత్వం, న్యాయం, సత్యం వంటి విలువలను బోధించాయని ఆర్ఐ సీతారామరెడ్డి అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: