ప్రబల ఏర్పాటల్లో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

కొండ గురువయ్య తిరుణాల సందర్భంగా వేముల గ్రామస్తులు ఏర్పాటు చేయనున్న విద్యుత్ ప్రభ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ కోరారు. మండలంలోని వేముల గ్రామంలో గ్రామస్తులకు ప్రభా ఏర్పాటు చేయనున్న నిర్వాహకులకు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామంలో ప్రభ ఏర్పాటు లో తగిన జాగ్రత్తలు తీసుకొని శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని కోరారు. అదేవిధంగా గ్రామం నుండి కొండ గురవయ్య నిధికి లోకి వెళ్లే సమయంలో రోడ్డు మరమ్మతు చేసుకొని ప్రభ వాహనాల కు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు పాటించాలన్నారు . గ్రామములో చిన్న చిన్న విషయాలకు ఘర్షణలకు పాల్పడి పంతాలు పట్టింపుల కు పోకుండా ఉండాలి అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *