దర్శి నియోజక వర్గం నగర పంచాయితీ పరిధిలోని కొత్త రెడ్డి పాలెంకు చెందిన బిజేపి సీనియర్ నాయకుడు, కిసాన్ సెల్ బాధ్యుడు వీరంరెడ్డి నాగి రెడ్డి (52) గురువారం మృతి చెందాడు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతి చెందాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఆయన మృత దేహాన్ని గురువారం బిజేపి జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి, నియోజక వర్గ ఇన్చార్జి మాడపాకుల శ్రీనివాసులు సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు.
