గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులకు సక్రమంగా సేవలు అందించి వారి పనితీరు మెరుగు పరుచుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. తూర్పుగంగవరం రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం రైతు సంఘ అడ్వజరీ కమిటీ, వ్యవసాయ సహాయకులతో సమావేశం. నిర్వహించారు. రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు పొలాల్లో ఉంటారని, వారి అనుకూల సమయంలో రైతులకు అందుబాటులో ఉండి ఈ- క్రాప్, ఈ- కెవైసీ, పీఎం. కిసాన్ ఎన్. పి. ఐ లింక్ గాని, పొలం బడి తదితర విషయాలపై అవగాహన కల్పించాలని వివరించారు. కార్యక్రమంలో విఏఏ సుమ, ప్రకృ సాగు ఇన్చార్జి నరసింహులు, రైతు సంఘ అడ్వజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రైతులకు సక్రమంగా సేవలు అందించాలి
03
Feb