భారత రాజ్యాంగంపై ప్రతి విద్యార్థి చిన నాటి నుండే అవగాహన కలిగి ఉండాలని మండల విద్యాశాఖాధికారి జి సబ్బయ్య అన్నారు. స్థానిక కస్తూరిభా పాఠశాలలో శనివారం విద్యార్థులకు రిపబ్లిడే సందర్భంగా దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. డిబిఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రాముఖ్యతనుమండల విద్యాశాఖాధికారి సుబ్బయ్య వివరించారు. కస్తూరిబా ప్రిన్సిపాల్ సుజిత మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంపై క్విజ్ పోటీలను ఏర్పాటు చేసి విద్యార్థినీ లలోఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీయటానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ రచనలను విద్యార్థులకు తెలియజేయటానికి ఇలాంటి క్విజ్ మరియు వ్యాస రచన పోటీలు పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయని వారు అన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రకాశం జిల్లా కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ…. క్విజ్ పోటీలను ఏర్పాటు చేసి వారిలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు మరియు స్కూల్ కి బెస్ట్ అవార్డుగా ఉపాధ్యాయుల సిబ్బందికి అందించడం జరిగిందని వారు అన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు చాలా ఉపయోగకరమైనవని అదే విధంగా భారత రాజ్యాంగం బాలికలకు అర్థమయ్యే రీతిగా బాలల కోసం భారత రాజ్యాంగం ప్రవేశికలను గ్రంథాలయంలో పెట్టడం జరిగినది.హక్కుల అవకాశాల గురించి బాలల కోసం వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ డైరెక్టర్ అల్లడి దేవ కుమార్ కి ప్రధానోపాధ్యాయుల బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. డిబిఆర్సి ముండ్లమూరు కోఆర్డినేటర్ గోపన బోయిన వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

