ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తూర్పు గంగవరంకు చెందిన
భీమిరెడ్డి నాగమల్లేశ్వర రెడ్డి నియమితులైనారు. జిల్లాలో ఇప్పటికే భీమిరెడ్డి నాగమల్లేశ్వర రెడ్డి సంఘ జిల్లా యూత్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. గుంటూరులో జరిగిన సమావేశంలో ఈమేరకు ఆదివారం నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. ఎపీఆర్ఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి శివా రెడ్డి, ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి, ఎపీఆర్ఎస్ అధికార ప్రతినిధి బత్తుల బత్తుల బాలి రెడ్డి, ఉపాధ్యక్షుడు పురిణి శ్రీనివాస రెడ్డి, మహిళా నాయకులు సుశీల రెడ్డి, శ్రీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
