ఉపాధినిధులదుర్వినియోగంకు పాల్పడ్డ విఠలాపురం సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి సస్పెన్షన్
-చట్టపరచర్యలకై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎంపీడీవో కె. వై కీర్తి – హైకోర్టు ఆదేశాలతో చర్యలకు ఉపక్రమించిన అధికార యంత్రాంగం

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం పంచాయతీ నందు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు దుర్వినియోగంకు పాల్పడ్డ గ్రామసర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డిని పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మూడునెలల పాటు సస్పెండ్ చేస్తూ ..జిల్లా కలెక్టర్ ఎ.ఎస్ దినేష్ కు మార్ శనివారంరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు మేరకు రాష్ట్ర పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీబి. రాజశేఖర్ ఉత్తర్వుల మేరకురూ 54 లక్ష ల8వేల 835 ఎన్ఆర్ఈజిఎస్ నిధులు దుర్వినియోగంకు పాల్పడి నందున గ్రామ సర్పంచ్ మారంఇంద్రసేనారెడ్డిని మూడు నెలల పాటు సర్పంచ్ విధులనుండి సస్సెండ్ చేస్తూ గ్రామ ఉపసర్పంచు కు బాద్యతలు అప్పగించాలని ఆదేశాలిచ్చారు. ఉపసర్పంచి కి బాధ్యతలు అప్పగించిన విషయాన్ని ట్రెజరీ కార్యాలయాలకు సమాచారం అం దించాలన్నారు. విఠలాపురం పంచాయతీ నందు ఉపాధిహామీ పథకం కింద 2018-19 సంత్సరంలోమానం రమేష్ బాబు, షేకా కాలేషావళిలు గ్రామ అభివృద్ధి పనులు చేయించగా సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి వారికి చెల్లించాల్సిన బిల్లు లను చెల్లించక పోవటంతో 2021 డిసెంబర్ రెండు న రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అదేశాలను పాటించకుండా … తాము పనులు చేశామని వచ్చిన నాగార్జున రెడ్డి కి బిల్లులు చెల్లించటంతో రమేష్, కాలేషాలు తమ వద్ద నున్న వివరాల ఆధారంగా.. బిల్లులు చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని కోర్టు దిక్కరణ వాజ్యం వేశారు. బిల్లుల చెల్లింపులో ఏర్పడిన వివావాదంపై హైకోర్టు సమగ్రవిచారణకు ఆదేశించింది. పంచాయతీరాజ్ ప్రిన్సిపుల్ సెక్రటరీ ఉత్తర్వులు మేరకు పంచాయతీ రాజ్ ఎస్ఈ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి.. ఉన్నతాధికారులకు నివేధించారు. ఫిబ్రవరి 1వ తేదీ జరిగిన విచారణలో వివాదంలో వున్న బిల్లులు తాలూకు పనులు కోర్టుదిక్కరణ వేసిన పిటీషనర్లు రమేష్, కాలేషావళిలు పనులు | దేశారని, ప్రభుత్వ పరంగా ఆనిధులను పంచాయతీకి జమచేయగా సర్పంచ్ దుర్వి నియోగంకు పాల్పడినట్లు గవర్నమెంట్ ప్లీడర్ హైకోర్టుకు తెలుపగా నిధుల దుర్వి నియెగంకు పాల్పడ్డ సర్పంచ్ ఏంచర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు ఆదేశిం చింది. హైకోర్టు ఆదేశాను సారం రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశే ఖర్ ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. ఫిబ్రవరి 6వతేదీలోపు తగు చర్యలు తీసుకోవాలన్న ఉత్తర్వుల మేరకు నిధుల దుర్వినియోగంకు పాల్పడ్డ సర్పంచి ని పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 3నెలలపాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాను సారం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కు పాల్పడ్డ సర్పంచ్ పై చట్టపర చర్యల నిమిత్తం ఎంపిడివో కెవైకీర్తి స్థానిక ఎస్సై బి. ప్రేమ్ కుమార్ కి సంబంధిత రికార్డులను అందజేసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *