ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని ఎమ్మెల్యే సోదరుడు, తాళ్లూరు వైసీపీ ఇంచార్జి మద్దిశెట్టి రవీంద్ర, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మారెడ్డి తెలిపారు. వేములలో శనివారం రాత్రి కొం డగురునాథ స్వామి తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మద్దిశెట్టి యూత్ ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై వారు పాల్గొన్నారు. వారు మాట్లా డుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పరిపాలన సాగుతోందన్నారు. ఇచ్చిన మాట కోసం ఎమ్మెల్యే మద్దిశెట్టి ఎంతవరకైనా వెళ్తారనడానికి సుంకర సునీతను ఎంపీపీగా చేయడమే నిదర్శనమ
న్నారు. స్వగ్రామం కాకపోయినప్పటికీ తమను ఆదరించి ఎంపీటీసీగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలి పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారం లోకి తీసుకొచ్చి మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నను చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనం తరం మద్దిశెట్టి రవీంద్ర, సుంకర బ్రహ్మారెడ్డి, తాళ్లూరు, ముండ్లమూరు జెడ్పీటీసీలు మారం వెంకట రెడ్డి, తాతపూడి రత్నరాజులను ఘనంగా సన్మానిం చారు. వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి వెంటేశ్వర రెడ్డి, పాలెపోగు డగ్లస్, గోపనబోయిన ఫిలిప్ రాజు, సర్పంచ్లు జనమాల నాగేంద్రం పిచ్చయ్య, గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.


