ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన పిచ్చాల నారాయణరెడ్డి, గొంగటి నాగ సురేష్ రెడ్డి కుటుంబాలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆదివారం పరామర్శించారు. విహారయాత్రలకు వెళ్లి విషాదం చోటుచేసుకోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైఎస్ఆర్సిపి నాయకులు వెన్నపూస బాపి రెడ్డి, మాజీ వార్డు మెంబరు కర్నా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

