ఉత్తమ ఫ్యామిలీ ఫిజిషియన్గా తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలోఇరువురు వైద్యులు అవార్డు అందుకున్నారు. తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి
ఖాదర్ మస్తాన్ బి కి విఠలాపురం సచివాలయ పరిధిలో ఉత్తమ ఫ్యామిలీ ఫిజిషియన్ సేవలు అదించినందుకు గాను, మరో వైద్యుడు హనుమానాయక్ శివరామపురం సచివాలయ పరధిలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను’ అవార్డులు అందుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎ.ఎస్ దినేష్ కుమార్ సోమవారం ఒంగోలు స్పందన హాల్లో వారికి అవార్డులు అందించారు. వైద్య శాఖ సిబ్బంది పూర్తి సహకారంతో తాము ఈ ఘనత సాధించినట్లు వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి, వైద్యుడు హనుమా నాయక్ లు తెలిపారు.
ఉత్తమ ఫ్యామిలీ ఫిజిషియన్ లు గా తాళ్లూరు పీహెచ్సీలో ఇరువురు వైద్యులు
06
Feb