రబీలో సాగు చేసిన పంటలకు రైతులుకు ఈ- క్రాప్ నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. మల్కాపురం, రాజానగరం గ్రామాలలో సోమవారం రైతులతో సమావేశమై ఈ- క్రాప్ ప్రాముఖ్యతను వివరించారు. కౌలు దారులైతే యజమానుల అనుమతితో కౌలు కార్డును (సీ.సీ.ఆర్.సి కార్డు) క్రాప్ కల్టివేషన్ రైట్స్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఈ- క్రాప్ నమోదు చేసుకోవాలని కోరారు. రబీలో ఇప్పటి వరకు మండలంలో 25 రకాల పంటలు 2265 ఎకరాలలో 751 మంది రైతులు ఈ- క్రాప్ నమోదు చేయటం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచి షేక్ వలి, విఏఏ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
రబీలో సాగు చేసిన పంటలకు ఈ- క్రాప్ నమోదు చేసుకోవాలి – వ్యవసాయాధికారి ప్రసాదరావు
06
Feb