జోడా యాత్రతో జోష్ – రాహుల్ గాంధీని ప్రధాని చేయటానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచెయ్యాలి- దర్శి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పుట్లూరి కొండా రెడ్డి

దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో కాంగ్రెస్ లో జోష్
వచ్చిందని దర్శి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పుట్లూరి కొండా రెడ్డి అన్నారు. తాళ్లూరులో జోడో యాత్ర పూర్తి చేసిన సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో యాత్ర నిర్వహించారు. దర్శి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పుట్లూరి కొండా రెడ్డి మాట్లాడుతూ .. కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మతాలను ప్రాంతాలను విభజించి పాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ భారతదేశం ఒకే మతం ఒకే కులం ఒకే ప్రాంతం అనేటువంటి నినాదంతో దేవుడు యాత్ర ప్రారంభించడం జరిగినదిని , యాత్రకు విశేషమైనటువంటి ప్రజాదరణ వచ్చినటువంటి సందర్భాల్లో మనందరం చూసా మని అన్నారు . ప్రజలందరు కలసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారని కొండారెడ్డి అన్నారు . రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే .. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతామని చెప్పడం జరిగినది.. 3 లక్షల రూపాయల్లో రుణమాఫీ చేస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, రాజధాని అమరావతి లోనే…. కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తామని .. విభజన చట్టంలోని హామీలన్నీ కూడా నెరవేరుస్తామని.. హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయాలని ఉద్దేశంతో ప్రజలు ఉన్నారని స్పస్టం చే సారు . రాహుల్ గాంధీని ప్రధాని చేయటానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచెయ్యాలని వక్తలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోనికి వస్తే రైతు,పెద, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో చేయూత ఇస్తుందని అన్నారు.
కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు షేక్ కరిముల్లా, యువజన నియోజక వర్గ అధ్యక్షుడు పుట్లూరి జయసింహా రెడ్డి, పీసీసీ మెంబర్ సాయి క్రిష్ణ, చిన కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *