పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం గంటల వ్యవధిలో అన్నాదమ్ములు మృతిచెందారు. గ్రామానికి చెందిన పెద్ద అల్లూరి రెడ్డి(67), చిన్న అల్లూరి రెడ్డి(65)లు సోదరులు. చిన్న అల్లూరి రెడ్డికి గుండెపోటు రావడంతో మార్కాపురం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. తమ్ముడి మృతదేహాన్ని చూసిన పెద్ద అల్లూరు రెడ్డి రోదిస్తూ గుండెపోటుతో చనిపోయాడు. దీంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది.
