ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరులోని ఎస్సీ కాలనీలో గల అసంపూర్తిగా ఉన్న అంగన్ వాడి భవనాన్ని పూర్తి చేయాలని కోరుతూ ఎస్సీ కాలనీవాసులు ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి. జడ్పిటిసి తాతపూడి మోజెస్ రత్నం రాజులకు ఆదివారం వినతి పత్రం అందజేశారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎంపీపీ చాంబర్లో వారిని కలిసి సమస్యను వివరించారు. ప్రభుత్వ హాయంలో అంగన్ వా డి భవనం కొరకు నిధులు మంజూరు అయ్యాయి. కాంట్రాక్టర్ స్లాబ్ వరకు మాత్రమే వేసి వదిలేశారు. అప్పటినుండి ఆ భవనం నిరుపయోగంగా మారింది. దీంతో అంగన్ వా డీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఆ భవనంలోనే కొనసాగుతోంది. అసంపూర్తిగా ఉండడంతో స్లాబ్ పెచ్చులు ఊడి ఇబ్బంది కరంగా మారింది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగు తోందని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతు న్నారని ఎస్సీ కాలనీకి చెందిన పాలపోగు డగ్లస్ తెలిపారు.
అంగన్ వాడి భవనాన్ని పూర్తి చేయాలి
12
Feb