నివాసంలోకి దూసుకు వెళ్లిన బొలెరో వాహనం – ఇల్లు ధ్వంసం – వ్యక్తికి తీవ్ర గాయాలు – మూడు లక్షల నష్టం

దర్శి అద్దంకి ప్రధాన రహదారిలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బోలోరే వాహనం ఇంటిలోకి దూసుకు వెళ్లిన సంఘటన లో ఉమ్మడి దాసరయ్య అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. వివరాల లోకి వెళితే …… హిందూపురం నుండి గుంటూరులోనే ఓ ప్రైవేట్ కళాశాలలో పరీక్ష రాసేందుకు వెళుతున్న ఓ బొలెరో వాహనం అద్దంకి దర్శి ప్రధాన రహదారిలో శంకరాపురం గ్రామంలో రోడ్డుకి దూరంగా ఉన్న ఓ ఇంటిలోకి డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా కుడి వైపున ఉన్న నివాసంలోకి దూసుకుపోయింది. బొలెరో వాహనం లో ఉన్న వారికి ఏమి దెబ్బలు లేవని తెలిపారు. దీంతో ప్రహరీ గోడ కూలి. ఇంటి గోడకు రంధ్రం పడి ఇంటిలో నిద్రిస్తున్న ఉమ్మడి దాసరయ్య. ఉమ్మడి వెంకటరావు. ఉమ్మడి లక్షమ్మ లు నిద్రించుచున్నారు మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వాహనం ఇంటిని గోడను ఢీ కొట్టుకుంటూ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి న వారు లేచి చూడగా మంచం మీద నిద్రిస్తున్న ఉమ్మడి దాసరయ్యపై ఇటుక రాళ్లు పడి మూలుగుతుండగా వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అద్దంకిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్లారు ఇంటి కి పెద్ద రంద్రమై ఇటుక బిల్లలు నేలమట్టమై స్లాబ్ మరియు. గోడలకు కూడా నెర్రెలు వచ్చాయని హౌస్ యజమాని ఉమ్మడి వెంకట్రావు వాపోయాడు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *