ముండ్లమూరు( మండల కేంద్రమైన ముండ్లమూరులో జరుగుతున్న ఉపాధి పనులను బుధవారం ఏపీఓ.కే. కొండయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాలలో ప్రతిరోజు మూడు వేల మందికి పైగా పనులు చేయాలని ప్రతిపాదించగా 2014 మంది పనులు చేస్తున్నారని తెలిపారు. ఉపాధి పనులు కావాలని అడిగిన వారందరికీ పనులు కల్పించే విధంగా కృషి చేయాలి అన్నారు. ప్రస్తుతం ఎండలు పెరుగుతున్నాయని వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలియజేశారు. పనుల వద్ద కూలీలకు మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. పనుల వద్ద కూలీలమస్టర్లలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ అశోక్ . ఫీల్డ్ అసిస్టెంట్ గోపన బోయిన పిలుపు రాజు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనులను పరిశీలించిన ఏపీవో
15
Feb