విద్యార్థిని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని వైద్యాధికారిని వి . జ్యోతి అన్నారు. ముండ్లమూరు లో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా వైద్య శాఖ అధికారుల ఆదేశాల మేరకు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రభుత్వం అనేక రకాల పథకాలు అందిస్తుందని ఆ పథకాలలో లోపాలు లేకుండా వారికి అందించాలని పాఠశాల ప్రిన్సిపల్ ఏ సునీత కు తెలియజేశారు. విద్యార్థులకు అందాల్సిన అన్ని రకాల సౌకర్యాలు అందించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముందుగా త్రాగునీరు. తరగతి గదులను .వంటగదులను. పరిశీలించారు విద్యార్థుల కొరకు తయారుచేసిన భోజనాన్ని కూరలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వైద్యాధికారులను సంప్రదించి వైద్య సేవలు పొందాలన్నారు . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏ సునీత. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్. పి నారాయణ రావు. ఆషా గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
15
Feb