ఫ్లోరోసిస్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

ఫ్లోరోసిస్ వ్యాధిపై పిల్లలకు వృద్ధులకు అవగాహన కల్పించినట్టు ఫ్లోరోసిస్ నియంత్రణ అధికారి వేము. అనిల్ కుమార్ తెలిపారు. మండలంలోని ఆదర్శ పాఠశాల. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం. చింతలపూడి మండల ప్రాథమిక పాఠశాల పెద ఉల్లగళ్ళు కొత్తూరు మండల ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఫ్లోరోసిస్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఫ్లోరోసిస్ వ్యాధి గురించి నివారణ చర్యల గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా పోషక ఆహారం విటమిన్ సి గురించి వాటి ప్రాధాన్యత గురించి వివరించారు. గ్రామాల్లోని ఫ్లోరోసిస్ గా నిర్ధారించబడిన వృద్ధులకు పునరావాసం కింద వాకింగ్ స్టిక్స్. నడుముకు కట్టుకునే బెల్టు. వీల్ చైర్ ప్రభుత్వం నుండి అందించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి వి జ్యోతి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నారాయణరావు. హెల్త్ విజిటర్ వి కన్యాకుమారి. ఏఎన్ఎం టీ ప్రభావతి . ఆషాలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *