ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి దయాకర్ రెడ్డి గెలిపించాలని బిజెపి నాయకులు బుధవారం దర్శి పట్టణం లో ప్రచారం నిర్వహించారు.
బిజెపి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు పీవీ శివారెడ్డి ప్రచారంలో పాల్గొని బిజెపి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని పలు కార్యాలయాలలో, కాలేజీలలో గ్రాడ్యుయేట్లను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన సన్నారెడ్డి దయాకర్ రెడ్డి కి మొదట ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసినదిగా కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల నాగేశ్వరరావు , అశోక్ యాదవ్ , అజయ్ , దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ మాడపాక శ్రీనివాసులు, దర్శి పట్టణ అధ్యక్షుడు అచ్యుత గురువర్ధన్ రావు , దొనకొండ మండల అధ్యక్షులు చీరల వెంకటేశ్వర్లు ,సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
