ముండ్లమూరు మండలం ఈదర గ్రామంలో ఓ గర్భిణీ సీ 108 వాహనంలో పండంటి బిడ్డను జన్మనిచ్చింది. ఈదర గ్రామానికి చెందిన మనీషా అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా అద్దంకి 108 సిబ్బంది, వైద్యశాల తరలించేందుకు గ్రామానికి చేరుకున్నారు. వైద్యశాలకు తరలిస్తున్న క్రమంలో సదరు మహిళకు పురిటి నొప్పులు అధికంగా, ఈఎంటి హరిబాబు సుఖ ప్రసవం చేశారు. కాగా ఆడబిడ్డ జన్మించగా మహిళ కుటుంబ సభ్యులు 108 సిబ్బందిని అభినందించారు.
