బెల్లంకొండ వారిపాలెంలో పంచాయితీ తీర్మానాలు లేకుండా నిధులు దుర్వినియోగం చేసారంటూ గ్రామానికి చెందిన జి. వి శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు మేరకు డీఎల్పీఓ పద్మ శనివారం విచారణ చేపట్టారు. స్థానిక పంచాయితీ కార్యాలయంలో ఫిర్యాదు దారుడుని పిలిచి విచారణ చేపట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి చెందిన పంచాయితీ సాధారణ నిధులు రూ. 1.88లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 8.44 లక్షలలో పంచాయితీ తీర్మాణాలు లేకుండా రూ.5.50లక్షలు ఆక్రమంగా నిధులు డ్రా చేసారని ఫిర్యాదు దారుడు శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. పంచాయితీ సమావేశాలు 90రోజులలో నిర్వహించలేడని, మెజార్టీ వార్డ్ సభ్యులు తిరస్కరించిన తీర్మాణాలు ఆమోదించినట్లు రికార్డులలో చూపించారని డి ఎల్ పి ఓ కి తెలిపారు . దీంతో స్పందించిన సర్పంచి.. పోశం సుమలత గ్రామంలో గ్రామ అవసరాల నిమిత్తం మంచినీరు, విద్యుత్. పారిశుధ్యం అవసరాల నిమిత్తం నిధులు వాడామని, అందుకు సంబంధించిన రికార్డులను, బిల్లులను గ్రామ కార్యదర్శి శ్రీవల్లి చూపించారు. పంచాయితీలో వార్డు సభ్యులను మెజార్జి ఉన్న కారణంగా పంచాయితీలో ఎటువంటి పనులు జరగకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా విభేదాల కారణంగా వ్యవహరిస్తున్నారని సర్పంచి సుమలత డీఎల్పీఓ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ సభ నిర్వహించి ప్రజల ఆమోదంతో ప్రజల అవసరాలు తీర్చామని తాము పైసా కూడ వృధా చెయ్యలేదని వివరించారు. ప్రజల సాధారణ అవసరాలు ఎటువంటి పరిస్థితులలో ఆగ కూడదని ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరిస్తానని డీఎల్పీఓ తెలిపారు. విచారణలో ఈ.ఓ.ఆర్.డి ఎన్ .యూ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంకొండ వారిపాలెం పంచాయితీ నిధులపై విచారణ – ప్రజల కనీస అవసరాలు తీర్చటానికి పంతాలు వీడి పనిచెయ్యాలని కోరిన డీఎల్పీఓ – తీర్మాణం లేకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించిన ఫిర్యాదు దారుడు- ప్రజా అవసరాల కోసమే చేపట్టామని సర్పంచి వివరణ
17
Feb