ఉపాధ్యాయులు అపరిష్కృత సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని
ఎపీటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో తిప్యూటి తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజుకు ఎపీటీఎఫ్ బాధ్యులు జవహార్ బాబు, రమేష్ లు వినతి పత్రం అందించారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి తప్పించాలని, రూ. 2500 వర్క్ అడ్జస్ట్మెంటును తప్పించి రెగ్యులర్ ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాలని, ఎపీజీఐ ఎల్ తుది చెల్లింపులు లోన్లు తక్షణమే మంజూరు చెయ్యాలని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కల్పించటం వంటి 17 దీర్ఘకాలిక సమస్యలను వినతి పత్రంతో విన్నవించారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎపీటీఎఫ్ వినతి
17
Feb