ప్రభుత్వం బడ్జెట్ లో వివిధ కార్పోరేషన్లకు నిధులు కేటాయించాలని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. దారా అంజయ్య మాట్లాడుతూ ….. నాలుగేళ్ల పాలనలో మాల మాదిగ రెళ్ళి మూడు కార్పొరేషన్ లు పెట్టీ నిరుద్యోగులకు,చిరువ్యాపారులకు, వక్క రూపాయి కూడా ఇవ్వకుండా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు . NSFDC,NSKFDC, ఋణాలు రికవరీ వున్నప్పటికీ తీయక పోవడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. లాండ్ పర్చేస్ రుణాలు మాఫీ అయినప్పటికీ ఈ రోజు కి వాళ్లకు NOC ఇవ్వక పోవడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అని దారా అన్నారు . NSFDC,NSKFDC, ఋణాలు ఇవ్వాలని, రుణ మాఫీ అయిన భూములకు NOC లు ఇవ్వాలని చివరి బడ్జెట్ లో నైనా నిధులు కేటాయించి దళిత నిరుద్యోగులను ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . అంబేడ్కర్ సాధన కమిటీ మండల కన్వినర్ రామయ్య, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్లో కార్పోరేషన్ ల కు నిధులు కేటాయించాలి
17
Feb