విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకుని ప్రణాళిక బద్ధంగా కృషి చేసి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ ఆకాంక్షించారు. ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమంలో ముండ్లమూరు ఎపీ మోడల్ పాఠశాల స్కూల్ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో కలిసారు. ఈ సందర్భంగా పరీక్షలు సమీపిస్తున్న కొలది విద్యార్థులు పరీక్షలకు తయారు అవుతున్న విధానాన్ని, విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ మలిక గర్ల్ కూడ విద్యార్థుల సమావేశంలో పాల్గొని విద్యార్థులకు తగిన సూచనలు చేసారు. విద్యార్థులు వైవీ క్రిష్ణా రెడ్డి, టి శివ పార్వతి, జాష్నవి, ప్రేమ్ చంద్, గాయత్రి, జితేంద్రలు తమకు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలసి మాట్లాడటం ఎంతో స్ఫూర్తిదాయకమని, తమకు అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, తమ పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ పూర్ణ చంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
