రోడ్లపై ప్రయాణించే వాహనదారులు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు వాహనానికి మించి ఎక్కించి ప్రమాదాలకు అవకాశం ఉందని వాహన చోధకులు ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని ముండ్లమూరు ఎస్సై ఎల్ సంపత్ కుమార్ అన్నారు, జిల్లా పోలీస్ అధికారుల సూచనల మేరకు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆటోవాలాలకు ప్రయాణికులకు ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు, పోలీస్ శాఖ ఇచ్చినటువంటి స్టిక్కర్లను ఆటోలకుఅంటించారు, ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పొలం పనులకు వెళ్లేవారు .ఉద్యోగ బాధ్యతలకు ప్రయాణించేవారు. కూలి పనులకు వెళ్లేవారు. తమ వాహనాల్లో ఎక్కువ మందిని ఎక్కించుకొని ప్రయాణం చేయడం నేరమన్నారు, దీనివలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు, మందు సేవించి ప్రయాణం చేస్తూ ప్రమాదం కొని తెచ్చుకోవద్దని వాహనదారులకు దారులకు సూచించారు, వాహనదారులకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీకు జరిగిన నష్టం తో పాటు మీ కుటుంబ సభ్యులు ఆర్థికంగా రోడ్డున పడాల్సి వస్తుందన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రయాణం సాగించాలన్నారు, రోడ్డు భద్రత నిబంధనల పాటిస్తూ ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలన్నారు, తద్వారా మీ కుటుంబాలతో పాటు ప్రయాణికుల కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని ఎస్ఐ తెలిపారు, ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు. అంకారావు. రైటర్ శ్రీనివాసరావు. మరియు బాబు. సూరిబాబు. ప్రేమనిది. అంజిబాబు మహేష్ తదితరులు పాల్గొన్నారు,
