ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ తెలిపారు, స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయా గ్రామాల సర్పంచులతో సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సర్పంచి తమ వంతు బాధ్యతగా ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు, తద్వారా ఏమైనా నేరాలు జరిగితే సులభంగా గుర్తించే వీలు ఉందన్నారు, దీనిని దృష్టిలో ఉంచుకొని అవకాశం ఉన్నంత మేరకు ప్రధాన కూడళ్లను గుర్తించి అవసరమైనవన్నీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్లు చొప్పరపు వెంకటేశ్వర్లు. నలమోలు వెంకటేశ్వరరావు. వేముల పద్మావతి శ్రీనివాసరావు. గజ్జల ఆదెమ్మ సుబ్బారెడ్డి. కందిమల్ల గీతాంజలి. గొర్రె శ్రీదేవి రాముడు. చిమ్మి ని రామకృష్ణ. వంగల పద్మావతి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
22
Feb