ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం

ముండ్లమూరులో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమెరికన్ ఆంకాలజీ పెదకాకాని వారి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు, ఈ సందర్భంగా క్యాన్సర్ నిపుణులు రాధా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు క్యాన్సర్ వ్యాధి నియంత్రణలో భాగంగా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు, దీర్ఘకాలికంగా తరచూ దగ్గు కళ్లపడటం వంటివి లక్షణాలు ఉన్నట్లయితే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు, అలసటగా ఉండడం బరువు తగ్గడం తరచుగా ఉన్నట్లయితే రక్త క్యాన్సర్ సంభవించే అవకాశం ఉందన్నారు, కడుపునొప్పి మలంలో రక్తం. తరచుగా విరోచనాలు మలబద్ధకం మన మల ద్వారం నుంచి అధికంగా గాలిపోవడం వంటివి ఉన్నట్లయితే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు, రొమ్ము లో చంకలో గడ్డ కట్టడం చనుమోలులో రక్తం లేదా ఇతర ద్రవాలు కారడం జరుగుతుంది రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు, మలవిసర్జన లో ఇబ్బందిగా ఉండడం వెన్నులో లేదా కాళ్లు మరియు చేతులు నొప్పి మూత్రం పూర్తిగా విసర్జించలేకపోవడము జరుగుతుంటే వీర్య గ్రంధి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆమె తెలియజేశారు. అనంతరం శిబిరంలో 25 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు, ఐదు మందిని గుర్తించి వారి నీ ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు, ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని వి జ్యోతి. ఎం జాస్మిన్. సిబ్బంది సిహెచ్ఓ నారాయణ. స్టాఫ్ నర్స్ రత్నకుమారి. హెచ్ వి కన్యాకుమారి. హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్. ఫార్మసిస్ట్ యుగంధర్. ల్యాబ్ టెక్నీషియన్ నాగార్జున. ఎఫ్ ఎన్ ఓ స్మైలీ. దిలీప్ కుమార్. స్వప్న . శ్రీలక్ష్మి. తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *