వేసవిలో అరుతడి పంటగా నువ్వులు లాభదాయకం

వేసవి ఆరుతడి పంటగా నువ్వుల సాగు లాభదాయకమని వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. బెల్లంకొండ వారిపాలెంలో నువ్వుల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. రానున్న వేసవి వాతావరణంలో చీడ పీడల బెడద తక్కువగా ఉండి విత్తన శుద్ధి నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చని అన్నారు. నీరు నిలువని తేమనిలిచే నేలలు శ్రేష్టంగా ఉంటాయని అన్నారు. గౌరి, మాధవి. యలమంచిలి రకాలు మన నేలను బాగా సరిపోతాయని అన్నారు. కిలో విత్తడానికి మూడు గ్రాములు థైరమ్ విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలని తెలిపారు. విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలని కలుపు రాకుండా పెండి మిథాలిన్ 30శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని, మరుసటి రోజు గాని పిచికారి చెయ్యాలని చెప్పారు. విత్తిన 20 నుండి 25 రోజుల లోపు గొర్రుతో అంతర కృషి చెయ్యాలని కోరారు. విఏఏ భార్గవి రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *