డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో వైద్య రంగంలో పేదలకు కార్పోరేట్ వైద్యం సాధ్యం అయినదని వక్తలు అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గురువారం కిమ్స్ హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఎంఎన్పీ నాగార్జున రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సహకారంతో వైద్యశిబిరం నిర్వహిస్తున్నామని, ప్రాధమిక పరీక్షల అనంతరం ఎమైనా ఇబ్బందులు ఉంటే వైద్యశాలలో ఆరోగ్యశ్రీలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్స అందిస్తారని చెప్పారు. అవ్వా, తాతలకు ఇబ్బందులు లేకుండా ఉండేందకు కిమ్స్ హాస్పటల్ సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కిమ్స్ వైద్యనిపుణులు డాక్టర్ బి. రామాంజనేయులు, టెక్నికిల్ సిబ్బంది పాల్గొని 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, రక్త పరీక్షలు, ఈసీజీలు తీసి ఉచితంగా మందుల పంపిణి చేసారు. మండల సచివాలయాల జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, సర్పంచిలు మందా శ్యామ్సన్, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, వలి, ఎంపీటీసీ బాల కోటయ్య, ఉప సర్పంచి కాశి రెడ్డి, గుంటి గంగా కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, ఎం.ఎల్. ఓ జి. మల్లేశ్వర రెడ్డి, రవి, జయ రామి రెడ్డి, పిఆర్ఓ జి గురవయ్య తదితరులు పాల్గొన్నారు.



